Telugu Gateway
Telangana

నిరుద్యోగ భృతిపై ఆలోచిస్తాం

నిరుద్యోగ భృతిపై ఆలోచిస్తాం
X

అధికార టీఆర్ఎస్ ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని.. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల భృతికి సంబంధించి విధివిధానాల రూపకల్పనలో ఉన్నప్పుడు కరోనా వచ్చిందన్నారు. ఆ సమయంలో కొన్ని నెలల పాటు ఉద్యోగులకు వేతనాలే సరిగా ఇవ్వలేకపోయామన్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదని సీఎం పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రభుత్వానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని అన్నారు.

తాము వంద శాతం పేదల పక్షం ఉంటామన్నారు. కొన్ని పెన్షన్లు, రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అతి త్వరలో తప్పకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. అలాగే కచ్చితంగా 57 ఏళ్ల పైబడిన వారికీ పెన్షన్లు ఇస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతిపై సీఎం కీలక ప్రకటన చేస్తారని వెల్లడించారు. విచిత్రం ఏమింటే ఇప్పుడు సీఎం కెసీఆర్ మాత్రం ఆలోచిస్తామని.అసలు నిరుద్యోగులు ఎవరు అనేది నిర్వచనం ఖరారు చేయాల్సి ఉందని వ్యాఖ్యనించటం విశేషం.

Next Story
Share it