Telugu Gateway
Telangana

ఇక్కడ చాలదన్నట్లు ఢిల్లీ కూడా వెళ్ళారా?!

ఇక్కడ చాలదన్నట్లు ఢిల్లీ కూడా వెళ్ళారా?!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవిత పేరు అధికారికంగా ఈడీ బయట పెట్టాక వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఇది. ఇక్కడ చాలదన్నట్లు ఢిల్లీ కూడా వెళ్ళారా? అని. గత ఏమినిది ఏళ్లుగా తెలంగాణ లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంపై చాలా అవినీతి ఆరోపణలే వచ్చాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, భూముల అమ్మకాలు..కేటాయింపుపై ప్రతిపక్షాలు చాలాసార్లు ఆరోపణలు చేశాయి. వాటిని ప్రభుత్వం బుల్డోజ్ చేసుకుంటూ వెళుతోంది. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం లో సీఎం కెసిఆర్ కుమార్తె పేరు రావటం అంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఢిల్లీ బీజేపీ నేతలు మీడియా సమావేశం పెట్టి మరి కవితపై ఆరోపణలు చేయటం...దీనిపై కవిత ఆగమేఘాల మీద కోర్ట్ కు వెళ్లి తనపై నిరాధార విమర్శలు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగినట్లే కనిపిస్తోంది. ఈడీ పక్కా ఆధారాలతో సహా కవిత ఎన్ని నంబర్లు మార్చారు...ఆ నంబర్ల తో ఎన్ని ఫోన్లు వాడారు అనే విషయాన్నీ తాజాగా ఢిల్లీ లో అరెస్ట్ చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. దీంతో కవిత ఈ స్కాములో చిక్కుకున్నట్లు తేలిపోయింది. ఇంత కలం తనకు ఎలాంటి సంబంధం లేదని..బీజేపీ వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాడు అంటూ విమర్శలు చేశారు.

కానీ ఇప్పుడు ఈడీ కవిత వాడిన నెంబర్లు 62099 99999 , 89956 99999 లను వెల్లడించటంతో పాటు... వీటి కోసం పది ఫోన్లు వాడారు అనే విషయాన్ని కూడా తేల్చారు. తమ పని అయిపోయిన తర్వాత వాటిని ధ్వంసం చేశారు. కవిత తో పాటు ఇప్పటికే ఈ కేసు లో అరెస్ట్ అయి ఉన్న శరత్ చంద్ర రెడ్డి కూడా ఫోన్లు మార్చి మార్చి వాడటం తో పాటు వాటిని నాశనం చేశారు..ఇందులో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా. ఇలా నాశనం చేసిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను కూడా ఈ డీ తన రిపోర్ట్ రిపోర్ట్ లో ప్రస్తావించింది. తెలంగాణ ప్రiజల ఆకాంక్షలతో ఏర్పాటు అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సీఎం కెసిఆర్ ఫ్యామిలీ దోచుకుంటుంది అంటూ అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీ నేతలు చాలా కాలంనుంచి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పడు ఈడీ కొన్ని విషయాలను మాత్రమే బహిర్గతం చేసింది అని...ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం సమావేశాల్లో పాల్గొనటానికి స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్లిన వివరాలతో పాటు..ఢిల్లీ జరిగిన సమావేశాల వివరాలు కూడా ఇంకా కేంద్ర ఏజెన్సీల వద్ద ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it