Telugu Gateway
Telangana

తెలంగాణ బడ్జెట్ 2,30,825.96 కోట్లు

తెలంగాణ బడ్జెట్ 2,30,825.96 కోట్లు
X

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు గురువారం నాడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదించారు. ఏడేళ్ల వయస్సు ఉన్న తెలంగాణ పలు రాష్ట్రాలను అధిగమించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కరోనా సమస్యను అధిగమించి ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నామని తెలిపారు.

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు

తెలంగాణ బడ్జెట్‌ 2 లక్షల 30 వేల 825 కోట్లు

రెవెన్యూ వ్యయం లక్షా 69 వేల 383.44 కోట్లు

క్యాపిటల్ వ్యయం 29 వేల 46 కోట్లు

రెవెన్యూ మిగులు 6743.50 కోట్లు

ఆర్థిక లోటు 45,509 కోట్లు

ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు

నూతన సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు

రీజనల్‌ రింగ్‌రోడ్డు భూసేకరణకు రూ.750 కోట్లు

అటవీశాఖకు రూ.1276 కోట్లు

ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు

పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధికి రూ.29,271 కోట్లు

గత బడ్జెట్‌ కంటే 48 వేల కోట్లు అధికంగా కేటాయింపు

దేవాదాయశాఖకు రూ.720 కోట్లు

రైతుబంధుకు రూ.14,800 కోట్లు

రుణమాఫీకి రూ.5,225 కోట్లు

వ్యవసాయరంగానికి రూ.25వేల కోట్లు

పశుసంవర్థక, మత్స్యశాఖకు రూ.1730 కోట్లు

సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు

సమగ్ర భూసర్వే కోసం రూ.400 కోట్లు

రైతుభీమా పథకానికి రూ.1200 కోట్లు

వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.1500 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు

సీఎం దళిత ఎంపవర్‌మెంట్‌ కోసం రూ.1000 కోట్లు

పల్లె ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు రూ.5761 కోట్లు

గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు

గొల్ల కురుమలకు రూ.300 కోట్లతో 3 లక్షల యూనిట్ల గొర్రెలు

చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు

బీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు

బీసీ సంక్షేమశాఖకు రూ.5,522 కోట్లు

మైనార్టీల సంక్షేమానికి రూ.1600 కోట్లు

పోలీస్‌ స్టేషన్లలో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.20 కోట్లు

యూనివర్సిటీల్లో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.10 కోట్లు

స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్లు

మహిళ శిశు సంక్షేమం రూ.1702 కోట్లు

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం రూ.11 వేల కోట్లు

పట్టణ ప్రగతి కోసం రూ.500 కోట్లు

వైకుంఠ దామాల నిర్మాణానికి రూ.200 కోట్లు

ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ.250 కోట్లు

సుంకిశాల తాగునీటి ప్రాజెక్ట్‌కు రూ.725 కోట్లు

మూసీ నది పునరుజ్జీవం కోసం రూ200 కోట్లు

మెట్రో రైలుకు రూ.1000 కోట్లు

ఓఆర్‌ఆర్‌ వెలుపలి కాలనీల తాగునీటి కోసం రూ.250 కోట్లు

వరంగల్‌ కార్పొరేషన్‌కు 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు 150 కోట్లు

మున్సిపల్‌శాఖకు రూ.15,030 కోట్లు

వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు

పాఠశాల విద్య రూ.11,735 కోట్లు

ఉన్నత విద్య రూ.1,873 కోట్లు

విద్యారంగ ఉన్నతీకరణకు రూ.4 వేల కోట్లు

ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణకు రూ.2 వేల కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లు

ఐటీ రంగానికి రూ.360 కోట్లు

రహదారులు, భవనాలశాఖకు రూ.8,788 కోట్లు

పంచాయతీరాజ్‌ రహదారులకు రూ.300 కోట్లు

పోలీస్‌ శాఖకు రూ.725 కోట్లు

రాష్ట్రంలో కొత్తగా 21 ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.400 కోట్లు

కొత్త ఎయిర్‌పోర్టుల కోసం రూ.100 కోట్లు

హోంశాఖకు రూ.6,465 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు

టూరిజం రూ.726 కోట్లు

Next Story
Share it