బీజేపీ డిజిటల్ యాడ్స్ దూకుడు

నేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు అయన కుటుంబ సభ్యులు అంటే మంత్రి కేటీఆర్, కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితలపై కూడా డైరెక్ట్ ఎటాక్ చేస్తూ యాడ్స్ ఇచ్చారు. ‘కొడుక్కి రియల్ ఎస్టేట్..కూతురికి లిక్కర్ కట్టబెట్టినందుకు.చట్టాన్ని చుట్టంగా చేసుకున్న దౌర్జన్య పాలనకు, యువత కలలను కల్లలు చేసినా పేపర్ లీకులకు, రైతులకు భీమా అందించలేని పాలనకు, మహిళలపై ఆగని అఘాయిత్యాలకు’ సాలు దొర సాలు దొర ఉద్యమంలో భాగం అవ్వండి అంటూ యాడ్స్ ఇస్తోంది. ఎక్కడ చూసిన ఇప్పుడు ఇవే కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ అధికార బిఆర్ఎస్ ను ఢీకొట్టటానికి ఈ డిజిటల్ ప్రచారం ఒక్కటే సరిపోతుందా అన్న సందేహాలను ఆ పార్టీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ యాడ్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.