Telugu Gateway
Telangana

తెలంగాణ బీజేపీ లో కాంగ్రెస్ స్టైల్ అసమ్మతి!

తెలంగాణ బీజేపీ లో కాంగ్రెస్ స్టైల్ అసమ్మతి!
X

తెలంగాణ బీజేపీ లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. చాలా మంది నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఎక్కువ మంది నేతలు ఎవరి దారి వారే అన్న చందంగా వ్యవరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ లో ఎక్కువ మంది ఇతర పార్టీ ల నుంచి చేరిన సీనియర్ నేతలు ఉన్నారు. వీరికి బండి సంజయ్ తీరు ఏ మాత్రం రుచించటం లేదు. ఎలాగైనా ఈ సారి తెలంగాణ లో అధికారంలోకి రావాలని కేంద్ర నాయకత్వం కలలు కంటుంటే రాష్ట్ర నాయకులు మాత్రం అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉన్నారు. మరో వైపు మెజారిటీ నియోజవర్గాల్లో బీజేపీ కి సరైన అభ్యర్థులు లేరు అనే ప్రచారం కూడా ఉంది. బండి సంజయ్ ఎంత సేపు ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ల పై ప్రశంసలు కురిపిస్తూ బండి నెట్టుకొస్తున్నారు. కానీ రాష్ట్ర నాయకులతో మాత్రం కలిసి ముందుకు సాగటం లేదు అనే విమర్శలు ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల వేళ ఇవి అన్ని బయటికి వస్తుండంతో బీజేపీ నాయకత్వంలో కూడా ఒకింత ఆందోళన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ తెలంగాణ బీజేపీ లో కాక రేపాయని చెప్పొచ్చు. జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు అంటే కేవలం అయన బాధ్యత సమన్వయం చేయటం మాత్రమే. అదేదో పవర్ సెంటర్ కాదు. కో ఆర్డినేషన్ సెంటర్ మాత్రమే .

దీనికి విపరీతమైన బాధ్యతలు ఉంటాయి అంటూ అరవింద్ కీలక వ్యాఖలు చేశారు. ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ వ్యాఖలను తాను సమర్ధించటం లేదు అని . పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి అయన వాటిని ఉపసంహరించుకుంటే మంచిది. అంటూ ధర్మపురి అరవింద్ ఇటీవల స్పదించిన విషయం తెలిసిందే. మరికొంత మంది నాయకులు కూడా ధర్మపురి సంజయ్ వ్యాఖలకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. కొంత మంది నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఇస్తే బాగుంటుంది అనే ప్రచారం కూడా తెర పైకి తెచ్చారు. ఇది కూడా బీజేపీ లో రచ్చకు కారణంగా మారింది. అయితే కేంద్ర నాయకత్వం మాత్రం ఎన్నికల వరకు బండి సంజయ్ అనే సంకేతాలు పంపింది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం బీజేపీ వచ్చే ఎన్నికల్లో చూపించే ప్రభావం పరిమితంగానే ఉంటుంది అని చెపుతున్నారు. తెలంగాణ బీజేపీ లో కూడా కాంగ్రెస్ స్టైల్ అసమ్మతి వచ్చింది అని...రాబోయే రోజుల్లే ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. బండి సంజయ్ పై చాలా మంది నేతలు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అని..పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ బీజేపీ కి గడ్డు కాలమే అన్న చర్చ సాగుతుంది. రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎన్నికల ముందు అన్ని లెక్కలు వేసుకుని గెలుపు అవకాశాలు ఉన్న పార్టీ వైపు మొగ్గుచూపిస్తారు. మరి తెలంగాణ బీజేపీ లో ఉన్న ఈ లుక లుక లను అధిష్ఠానము ఎలా పరిస్కరిస్తుందో వేచిచూడాల్సిందే.

అయన మాట్లాడాడు ..

Next Story
Share it