Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి కి ఝలక్ ఇచ్చిన పార్టీ

రేవంత్ రెడ్డి కి ఝలక్ ఇచ్చిన పార్టీ
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి తన పరువు తానే తీసుకోవటం అంటే ఎంత సరదానో తెలియచేసే ఉదంతం ఇది. అసలు ఇప్పుడు ఏమి అవసరం ఉంది అని ఈ పోల్ పెట్టారు. పోనీ పోల్ పెట్టేటప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా ను ఏమైనా అలెర్ట్ చేశారా?. అసలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియా లో ఎంతో వీక్ ఉంది అనే ప్రచారం సొంత పార్టీ నేతల్లోనే ఉంది. మరో వైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ పదేళ్ల అనుభవంతో ఇందులో మాస్టర్స్ చేసింది. అబద్దాలను కూడా నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది...ఆ పార్టీ సోషల్ మీడియా ను నమ్ముకుని రాజకీయం చేస్తోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అసలు విషయం ఏమిటి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక పోల్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అనే ప్రశ్న వేసి అందులో రెండు ఆప్షన్స్ ఇచ్చింది. అందులో ఒకటి ఫార్మ్ హౌస్ పాలనా లేక ప్రజల వద్దకు పాలనా అని ప్రశ్నించింది. అయితే ఈ పోల్ లో విచిత్రంగా ఓటు వేసిన వాళ్లలో 67 శాతం ఫార్మ్ హౌస్ పాలన కావాలని కోరుకున్నారు. అంటే వీళ్ళు అంతా ఒక్క మాటలో చెప్పలంటే కెసిఆర్ పాలన కోరుకుంటున్నారు అని చెప్పినట్లు అయింది. అదే రెండవ ప్రశ్నకు అంటే ప్రజల వద్దకు పాలన కోరుకుంటున్న వారు 33 శాతం మంది మాత్రమే ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి పాలనకంటే కెసిఆర్ పాలనే కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పెట్టిన పోల్ లో వెల్లడైంది.

ఈ రిజల్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది అనే చెప్పాలి. వాస్తవానికి ఈ రిజల్ట్స్ విషయంలో ఏమి జరిగింది అనే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వ పరువును తానే తీసుకున్నట్లు ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పోల్ లో ఓటు వేసిన మొత్తం 92551 ఓట్లలో...62010 (67%) మంది రేవంత్ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు పాలనపై పెదవి విరుస్తున్న వివిధ వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ నే స్వయంగా ఇలాంటి పోల్స్ తో మరింత డ్యామేజ్ చేస్తోంది అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నా కూడా బిఆర్ఎస్ ఎటాక్ చేస్తూ ఆ రాజకీయ ప్రయోజనం అధికార పార్టీ కి దక్కకుండా ప్రచారం చేయటంలో విజయవంతం అవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సెల్ఫ్ గోల్స్ కొట్టుకొంటోంది అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లోనే వ్యక్తం అవుతోంది. పోల్ ఫలితం షాక్ ఇవ్వటం తో కాంగ్రెస్ పార్టీ తర్వాత దీన్ని డిలీట్ చేసింది. కానీ అప్పటికి ఇది సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Next Story
Share it