కెసీఆర్ తో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ భేటీ
BY Admin11 Jan 2022 5:12 PM IST
X
Admin11 Jan 2022 5:12 PM IST
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తో బీహర్ లో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. తేజస్వితోపాటు ఆ పార్టీకి చెందిన నేతలు కూడా కెసీఆర్ తో సమావేశం అయిన వారిలో ఉన్నారు. ఇటీవలే వామపక్ష పార్టీ నేతలతో సమావేశం అయిన కెసీఆర్..మంగళవారం నాడు తేజస్వితో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల నుంచి కెసీఆర్ బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో బిజెపిని వ్యతిరేకించి నేతలతో వరస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్జేడీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసింది.
Next Story