హైదరాబాద్ మార్కెట్లో అందుబాటులోకి

సరళతరంగా ఉపయోగించేందుకు అనువైన ఇంటెలిజెంట్ స్మార్ట్ హోమ్ సాంకేతికతతో రూపొందిన టాటా పవర్ EZ హోమ్ సొల్యూషన్స్ (Tata Power EZ Home Solutions)ను భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంత హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌లో టాటా పవర్ అందుబాటులోకి తెచ్చింది. టాటా పవర్ యొక్క విశ్వసనీయత, ఆవిష్కరణల వారసత్వం దన్నుతో EZ హోమ్ అనేది పర్యావరణ అనుకూల విధానాలతో జీవించడంలో తోడ్పడటంతో పాటు లైటింగ్, వాతావరణం, భద్రత, విద్యుత్ ఆదాను చేసేలా యాప్ ఆధారిత నియంత్రణలతో మరింత సౌకర్యాన్ని, భద్రతను, సమర్ధవంతమైన నిర్వహణను అందిస్తుంది. ఆధునిక పట్టణ ప్రాంత జీవనవిధానాల కోసం డిజైన్ చేసిన ఈ సొల్యూషన్స్, యూజర్లకు మరింత నియంత్రణనిచ్చే విధంగా కనెక్టెడ్ జీవన అనుభూతిని అందిస్తాయి. ప్రస్తుతమున్న ఎలక్ట్రికల్ సెట్అప్‌లకు ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం లేకుండానే టాటా పవర్ EZ హోమ్ పోర్ట్‌ఫోలియోలో స్మార్ట్ సాకెట్లు, టచ్ ప్యానెల్ స్విచ్‌లు, రెట్రోఫిటబుల్ కన్వర్టర్లు, మోషన్ సెన్సార్లు మొదలైనవి సులువుగా అనుసంధానమవుతాయి. అందుకే హైదరాబాద్‌వ్యాప్తంగా కొత్తగా కట్టిన గృహాలకే కాకుండా ఇప్పటికే ఉన్న గృహాలకు కూడా ఈ సొల్యూషన్స్ అనువైనవిగా ఉంటాయి అని కంపెనీ ప్రతినిధులు బుధవారం నాడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ఫీచర్లతో EZ హోమ్ అనేది వోల్టేజీ హెచ్చుతగ్గుల నుంచి ఉపకరణాలకు మరింత భద్రతనిస్తుంది. ఆటోమేటెడ్ షెడ్యూలింగ్ అనేది ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, వాషింగ్ మెషిన్లలాంటివి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగంలో ఉండేలా అనవసరంగా విద్యుత్ వినియోగించబడకుండా ఆదా అయ్యేలా చూస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సిస్టమ్ ఆఫ్‌లైన్‌లో కూడా పని చేసే విధంగా డిజైన్ చేయబడింది. తద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ పరిమితంగా ఉన్నప్పుడు కూడా నిరాటంకమైన పనితీరు ఉంటుంది. సాధారణంగా అత్యధిక వినియోగం ఉండే ఉపకరణాలు గల పట్టణప్రాంత కుటుంబానికి, EZ హోమ్ ఆటోమేషన్ వార్షికంగా విద్యుత్ వినియోగాన్ని సుమారు 15 శాతం తగ్గించగలదు. దీనితో ఏటా 1,300 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా కుటుంబానికి ఏటా సుమారు రూ. 10,000 వరకు విద్యుత్ చార్జీల వ్యయాలు ఆదా అవుతాయి. తగ్గిన వినియోగం, ఏటా 1.1 టన్నుల కర్బన ఉద్గారాల నివారణకు తోడ్పడుతుంది. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 15 మొక్కలను నాటడానికి సరిసమానం.
ఆటోమేటెడ్ షెడ్యూలింగ్, రియల్ టైమ్‌లో ఉపకరణ వినియోగ పర్యవేక్షణతో ఎయిర్ కండీషనింగ్‌ని ఇంటెలిజెంట్‌గా, సమర్ధవంతంగా వినియోగించడం వల్ల ఓవర్-కూలింగ్, అనవసర రన్‌టైమ్‌ని నివారించి, గణనీయంగా ఆదా చేయొచ్చు. వేగంగా విస్తరిస్తున్న నగరంగా, పటిష్టమైన టెక్నాలజీ ఆధారిత వ్యవస్థగా పేరొందిన హైదరాబాద్‌లో స్మార్ట్, మరింత సమర్ధవంతమైన లివింగ్ సొల్యూషన్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. టాటా పవర్ EZ హోమ్ దీనికి అనుగుణంగా మరింత సౌకర్యం, భద్రత, విద్యుత్ ఆదా చేసే విశ్వసనీయమైన, విస్తరించతగిన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన హోమ్ ఆటోమేషన్‌ని అందిస్తోంది. టాటా పవర్ యొక్క EZ హోమ్ ‘100 సిటీస్, 1 పర్పస్’ కార్యక్రమంలో భాగంగా ఇది హైదరాబాద్‌లో ఆవిష్కరించబడింది. ఇది మెట్రోలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలవ్యాప్తంగా ఆధునిక భారతీయ గృహాలకు స్మార్ట్ మరియు సమర్ధవంతమైన జీవనాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించబడినది అని వెల్లడించారు.



