టార్గెట్ కెసీఆర్..వయా కె ఏ పాల్?!
ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌తో సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం, కేటీఆర్, కవిత చేస్తున్న అవినీతిపై ఇంతవరకు ఎవరూ సరైన ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పానన్నారు. కెసీఆర్ తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.తెలంగాణ తో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ నేతలు కూడా లిఖితపూర్వంగా ఫిర్యాదు చేసినా కూడా ఈ క్రెడిట్ కూడా కాంగ్రెస్ నేతలకు బిజెపి ఇవ్వాలనుకోదు కాబట్టి..ఇలా కె ఏ పాల్ లాంటి వారిని ఉపయోగిస్తోందని టీఆర్ఎస్ లో కూడా చర్చ సాగుతోంది.