Telugu Gateway
Telangana

ట్యాంక్ బండ్ పై సంద‌డే సంద‌డి

ట్యాంక్ బండ్ పై సంద‌డే సంద‌డి
X

సండే సండే ఇక ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ బంద్. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో. వారాంత‌పు వేళ‌ల్లో న‌గ‌ర‌వాసుల‌కు కాస్త ఊర‌ట నిచ్చేలా తెలంగాణ స‌ర్కారు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. తొలి సారిగా ఆగ‌స్టు 29న అమలు చేసి చూసింది. దీంతో ఈ ఆదివారం పెద్ద ఎత్తున న‌గ‌ర వాసులు కుటుంబాలతో స‌హా ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు వ‌చ్చారు. ఆదివారాల్లో సాయంత్రం 5గంటల నుంచి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అంబేద్కర్ విగ్ర‌హం నుంచి బుద్ధభవన్ వరకు నొ ట్రాఫిక్...హిమాయత్ న‌గ‌ర్ మీదుగా వాహనాలను మళ్ళించనుపన్నారు.

తొలి రోజు ఏర్పాట్ల‌ను హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ ప‌రిశీలించారు. గ‌త కొన్ని రోజులుగా సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేసిన త‌ర్వాత ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు. దీనికంటే ముందు ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొత్త లైటింగ్ తోపాటు సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కూడా చేప‌ట్టారు. ఇవి పూర్త‌యిన త‌ర్వాత ఇప్పుడు ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేసి ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించ‌నున్నారు. న‌గ‌రంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ ఒక‌టి అన్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it