Telugu Gateway
Telangana

గ‌వ‌ర్న‌ర్ పాత్ర ప‌రిమితం..రాజ‌కీయాలు మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు

గ‌వ‌ర్న‌ర్ పాత్ర ప‌రిమితం..రాజ‌కీయాలు మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు
X

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై గ‌త కొన్ని రోజులుగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై మంత్రి తలసాని శ్రీనివాస‌యాద‌వ్ బుధ‌వారం నాడు స్పందించారు. తాము ఏమీ నామినెటెడ్ ప‌ద్ద‌తిలో రాలేద‌న్నారు. ఎన్నికైన ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాద‌న్నారు. రాజ్యాంగ‌ప‌ర‌మైన ప‌ద‌విలో ఉన్న గ‌వ‌ర్న‌ర్ మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌టం ఏమిట‌న్నారు. రాజ్యాంగంలోనే ఎవ‌రి పాత్ర ఏమిటో ప్ర‌స్తావించార‌ని..ఉప రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ల రోల్ చాలా ప‌రిమితం అన్నారు.

ప్రజాస్వామ్యం లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం త‌మ‌ద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి తో పనిచేయటం ఇష్టం లేదు అని చెప్పటం సరికాదని, ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. గవర్నర్ గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అని త‌ల‌సాని సూచించారు. త‌ల‌సాని మ‌రో వైపు ప్రతిపక్షాలపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. వాటికి పనీ పాట లేదన్నారు. పొద్దున లేస్తే సోషల్ మీడియా లో ప్రచారం తప్ప వేరే ఏమీలేద‌న్నారు.

'పులి' క్షి

Next Story
Share it