టీడీపీకి ఎల్ రమణ రాజీనామా
BY Admin9 July 2021 12:16 PM IST

X
Admin9 July 2021 12:16 PM IST
తెలంగాణ తెలుగుదేశం ప్రెసిడెంట్ ఎల్ రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు రమణ ధన్యవాదాలు తెలిపారు. గురువారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలసి రమణ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శుక్రవారం ఉదయమే రాజీనామా చేశారు.
Next Story



