Telugu Gateway
Telangana

ఐటి హబ్ కు న్యూ లుక్

ఐటి హబ్ కు న్యూ లుక్
X

అమెరికా లోని న్యూ యార్క్ లో ఉండే టైమ్స్ స్క్వేర్ ఎంతో పాపులర్ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో హైదరాబాద్ లో కూడా ఐకానిక్ టి-స్క్వేర్ రానుంది. ఐటి హబ్ గా ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక టి స్క్వేర్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిజీఐఐసి ) ఈ ప్రాజెక్ట్ ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే టి స్క్వేర్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుంది. ఇదే లక్ష్యంతో టిజీఐఐసి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టబోతోంది. దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ తో పాటు లావాదేవీ సలహా సర్వీసులు ఇచ్చేందుకు అర్హత గల సంస్థలను ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రొపోజల్ (ఆర్ఎఫ్ పీ) పిలిచింది.

బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ గా ఈ టి స్క్వేర్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అయిన రాయదుర్గం ఏరియా లో వివిధ వర్గాల ప్రజలకు అవసరం అయిన పబ్లిక్ ప్లేస్ ల తో పాటు ఇతర సౌకర్యాల కొరత ఉంది అని..కొత్తగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ తో ఈ సమస్య తీరుతుంది అని భావిస్తున్నారు. టి స్క్వేర్ ఒక వైపు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉండటంతో పాటు ఇతర వాణిజ్య అవసరాలు, ఎంటర్ టైన్ మెంట్ హబ్స్ కు ఈ ప్రాంతం కీలకం కానుంది. ప్రైవేట్ డెవలపర్ తో ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ప్రతిపాదిత ప్రాజెక్ట్ తో హైదరాబాద్ లో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it