టీ హబ్ పై రతన్ టాటా ప్రశంసలు
BY Admin28 Jun 2022 12:16 PM IST
X
Admin28 Jun 2022 12:16 PM IST
భారతీయ స్టార్టప్ కంపెనీలకు తెలంగాణ సర్కారు కొత్తగా ప్రారంభించనున్న టి హబ్ మంచి అనువైన పరిస్థితులను కల్పించనుందని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా వ్యాఖ్యానించారు. ఆయన ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. టి హబ్ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారుకు, ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఆయన అభినందనలు తెలిపారు. టి హబ్ 2ను సీఎం కెసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి టి హబ్ గురించి చేసిన ట్వీట్ కు స్పందిస్తూ రతన్ టాటా ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ సర్కారు స్టార్టప్ లకు ఊతం ఇచ్చేలా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
Next Story