Telugu Gateway
Telangana

ఇక్కడా క్షమాపణ..అక్కడా క్షమాపణ !

ఇక్కడా క్షమాపణ..అక్కడా క్షమాపణ !
X

ఎమ్మెల్యేల ఎర కేసు లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహరించిన తీరు ఈ కేసు లో పెద్ద సమస్య గా మారింది ఫార్మ్ హౌస్ లో రికార్డు చేసిన వీడియో లు,,,ఆడియోలు అసలు సీఎం కెసిఆర్ చేతికి ఎలా వెళ్లాయి...కేసు విచారణలో ఉండగానే వాటిని సీఎం కెసిఆర్ ఒక వైపు మీడియాకు..మరో వైపు ఏకంగా సుప్రీం కోర్ట్ తో పాటు దేశంలోని అన్ని హై కోర్ట్ ల న్యాయమూర్తులకు పంపటం అప్పట్లోనే పెద్ద దుమారం రేపింది. ఇదే అంశంపై హై కోర్ట్ లో విచారణ జరిగిన సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి ప్రముఖ లాయర్ దుష్యంత్ దవె హై కోర్ట్ కు క్షమాపణలు చెపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సోమవారం నాడు సుప్రీం కోర్ట్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఈ కేసు విషయం లో ముఖ్యంగా జడ్జిలకు కేసు ఆడియో, వీడియోలను సీఎం ఎలా జడ్జిలకు ధర్మాసనం పంపుతారని ప్రశ్నించింది. సీఎం కెసిఆర్ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం అనుసరించిన పద్ధతి సరికాదని సుప్రీంకోర్టు సూచించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గబాయి ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలంగాణ సర్కార్ తరపున న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఈ కేసు విషయానికి వస్తే తొలుత తెలంగాణ ప్రభుత్వం సిట్ తో ఈ కేసు విచారణ కు ఆదేశించింది. ఆ సమయంలోనే కీలక ఆధారాలు బయటకు రావటం ..సిట్ రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతుల్లో ఉన్నందున ఈ కేసు ను సిబిఐ కి అప్పగించాలని కోరుతూ నిందితులు హై కోర్ట్ ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం హై కోర్ట్ ఈ కేసు ను సిబిఐ కి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీనిపై తెలంగాణ సర్కారు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగా..అక్కడ దీనిపై వాదనలు సాగుతున్నాయి.సీబీఐ చేతిలోకి కేసు వెళ్తే… ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని టీఎస్ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదించేందుకు త‌న‌కు మరింత సమయం కావాలని కోరారు. కోర్ట్ సమయం ముగియటం తో ఈ కేసు లో వాదనలకు బ్రేక్ పడింది. దీంతో తిరిగి ఈ కేసు లో ఎప్పుడు వాదనలు ప్రారంభం అవుతాయి అనే అంశంపై అనిశ్చితి ఏర్పడింది.

Next Story
Share it