Telugu Gateway
Telangana

సుజనా చౌదరి..రవి ప్రకాష్ సారధ్యంలో రెండు ఛానళ్ళు !

సుజనా చౌదరి..రవి ప్రకాష్ సారధ్యంలో రెండు ఛానళ్ళు !
X

తెలుగు, హిందీ ఛానళ్ల ఏర్పాటు దిశగా చర్యలు..బీజేపీ అండతోనే

గత కొన్ని రోజులుగా మీడియా లో ముఖ్యంగా వెబ్ మీడియా లో రవి ప్రకాష్ పై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే రవి ప్రకాష్ బిఆర్ఎస్ క్యాంపు లో చేరిపోయారు..కెసిఆర్ తో కలిసిపోయారు అని. కొత్త ఏడాది కొత్త ఛానల్ తో రాబోతున్నారు...జాతీయ స్థాయిలో రాజకీయ లక్ష్యాలు ఉన్న కెసిఆర్ కి సహకరించేందుకు అంతా సిద్ధం చేశారు అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ వాస్తవం మాత్రం వేరు అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రవి ప్రకాష్ బీజేపీ తోనే కలిసి ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మధ్యే చాలా కేసులనుంచి విముక్తి చెందిన సుజనా చౌదరి పేట్టుబడుల ఉపసంహరణ మీద దృష్టిపేట్టారు...సుజనా మాల్ , బర్త్ ప్లేస్ వంటి వ్యాపారాలను లాభాలకు అమ్ముకున్న సుజనా చౌదరి ప్రస్తుతం మీడియా మీద దృష్టి పెట్టారు.టీవి 9 వ్యవస్థాపకుడు రవిప్రకాష్ తో పని చేయడం ద్వారా దేశ వ్యాప్త మీడియా నెలకొల్పవచ్చని భావించిన సుజనా ప్రధానిని కలిసి చర్చించారు..ఢిల్లీ ఆశీస్సులతో టివి చానల్ ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది..

ఈ కార్యక్రమానికీ జూబ్లీహిల్స్ లో ఓ అధునాతన భవంతిని కేటాయించారు. తొలుత తెలుగు ఛానల్, తర్వాత హిందీ ఛానల్ కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ముఖ్యంగా మీడియా కి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే సుజనా చౌదరి, రవి ప్రకాష్ సంయుక్తంగా స్టార్ట్ చేయనున్న చానెల్స్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలమీదే ఫోకస్ పెట్ట బోతున్నారు. ఫస్ట్ తెలుగు, తర్వాత వెంటనే హిందీ ఛానల్ ప్రారంభిస్తారు అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతం లో సుజనా చౌదరి కొంత కాలం పాటు మహా న్యూస్ ఛానల్ యాజమాన్య బాధ్యతలు తీసుకున్నారు. . ఇప్పుడు రవి ప్రకాష్ తో కలిసి కొత్త ఛానెళ్ల ఏర్పాటుకు రెడీ అయ్యారు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో రవి ప్రకాష్ ప్రభావం మీడియా మీద ఎంత మేరకు ఉంటోందో వేచిచూడాలి.

Next Story
Share it