స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్

హైదరాబాద్ లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ పాస్ ల తరహాలోనే ఇప్పుడు మెట్రో పాస్ లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబదించిన విధివిధానాలను శనివారం నాడు హైదరాబాద్ మెట్రో విడుదల చేసింది. ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ విద్యార్థుల సౌకర్యార్థం జూలై ఒకటి, 2023 నుండి స్టూడెంట్ పాస్ ని ప్రకటించింది. హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ, సీఈఓ కెవిబి రెడ్డి కలిసి అమీర్‌పేట లోని మెట్రో స్టేషన్ లో స్టూడెంట్ బస్ పాస్ ఆఫర్ ను ప్రారంభించారు. స్టూడెంట్ పాస్ ఆఫర్ కింద, విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించాలి, అన్ని ఫేర్ జోన్లలో 30 ట్రిప్పులను వారు తిరగవచ్చు. అయితే దీనికోసం వారు తప్పనిసరిగా కొత్తగా బ్రాండ్ చేయబడిన స్మార్ట్ కార్డ్లను కొనుగోలు చేయాలి. ట్రిప్ పాస్ చెల్లుబాటు పాస్ కొనుగోలు తేదీ నుండి 30 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ 1 జూలై 2023 నుండి 31 మార్చి 2024 వరకు తొమ్మిది నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయబడుతుంది. 1 ఏప్రిల్ 1998 తర్వాత జన్మించిన విద్యార్థులు పాస్ పొందేందుకు అర్హులు. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుంది. సంస్థ నిర్ణయం ప్రకారం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
విద్యార్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెడ్ లైన్ లో - JNTU కళాశాల, SR నగర్, అమీర్పేట్, విక్టోరియా మెమోరియల్ మరియు దిల్సుఖ్నగర్, గ్రీన్ లైన్ - నారాయణగూడ, మరియు బ్లూ లైన్ - నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్ మరియు రాయదుర్గ్ వద్ద పాస్లను కొనుగోలు చేయవచ్చు.పాస్ కొనుగోలు చేసిన విద్యార్థులు 24సెవెన్ కన్వీనియన్స్ స్టోర్లు, రిలయన్స్ ట్రెండ్ మొదలైన హైదరాబాద్ మెట్రో రైల్తో అనుబంధించబడిన వివిధ రిటైల్ బ్రాండ్ల డిస్కౌంట్ కూపన్లను కూడా పొందుతారు. పాస్ పొందేందుకు మరియు నిబంధనలు మరియు షరతుల కోసం, www. ltmetro.com వెబ్ సైట్ లాగిన్ అయి వివరాలు తెలుసుకోవచ్చు. స్టూడెంట్ పాస్ స్టార్ట్ చేసిన సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక పాస్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. యువ మెట్రో రైలు ప్రయాణీకులకు నగదు కు తగ్గ ట్రావెల్ ఎంపికలో భాగంగా అత్యుత్తమ విలువతో సేవలందించేందుకు మా నిరంతర ప్రయత్నాల్లో ఈ ఆఫర్ భాగం. విద్యార్థులు తమ ప్రయాణాన్ని ఇప్పుడు మరింత మెరుగ్గా ఆనందిస్తారు అని అన్నారు



