Telugu Gateway
Telangana

సింగ‌రేణి కార్మికుల ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌స్సు పెంపు

సింగ‌రేణి కార్మికుల ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌స్సు పెంపు
X

తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సిఎం పదవీ విరమణ వయస్సుపెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనున్నది.

రామగుండం నియోజక వర్గ కేంద్రం లో సింగరేణి మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశం పై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్ లో మంగళవారం సీఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.

Next Story
Share it