కౌషిక్ రెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసు జారీ
BY Admin12 July 2021 4:57 AM

X
Admin12 July 2021 4:57 AM
హుజురాబాద్ కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సోమవారం నాడు ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.
గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా తీరు మార్చుకోలేదన్నారు. 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్న క్రమశిక్షణ సంఘం..లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story