Telugu Gateway
Telangana

కెబీఆర్ పార్కు ద‌గ్గ‌ర న‌టిపై దాడి

కెబీఆర్ పార్కు ద‌గ్గ‌ర న‌టిపై దాడి
X

ఊహించ‌ని ప‌రిణామం. వాకింగ్ చేస్తున్న న‌టిపై దాడి. ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కెళ్లాడు. ఆ క్ర‌మంలోనే న‌టి త‌న ఫోన్ తిరిగి చేజిక్కించుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా..ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమెకు గాయాలు అయ్యాయి. ఆ వెంట‌నే బాధిత న‌టి చౌరాసియా అక్క‌డ ఉన్న వారి సాయంతో డ‌య‌ల్ 100కు ఫోన్ చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. అగంతుక‌డి దాడిలో నటి చౌరాసియా తలకు, కాళ్లకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో చౌరాసియా కేబీఆర్‌ పార్క్‌ వద్ద వాకింగ్‌ వెళ్లింది.

ఈ స‌మయంలోనే ఆమెపై దాడి జ‌ర‌గ్గా, చౌరాసియా అతడితో పెనుగులాటకు దిగడంతో దుండగుడు తన ఫోన్‌ తీసుకుని పరారయ్యాడని, అంతేగాక తనను నగలు, నగదు ఇవ్వాలని కూడా దుండగుడు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజ్‌ పరిశీస్తున్నపోలీసులు నిందితుడి క‌నుగొనే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. గాయాల‌పాలైన చౌరాసియా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Next Story
Share it