రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురు అయింది. ఆయన పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.. ఇప్పటికే మరో ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేవేసింది. గతంలో హైకోర్టు.. సండ్ర, ఉదయసింహా, సెబాస్టియన్ పిటిషన్లను కొట్టివేయగా, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ వెల్లడించింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.