అఖిలప్రియకు మరోసారి నిరాశే
మాజీ మంత్రి అఖిలప్రియకు మరోసారి నిరాశే ఎదురైంది. పోలీసు కస్టడీ ముగియటంతో ఈ సారి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఆశించారు. కానీ సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చింది. హఫీజ్ పేట భూ వివాదానికి సంబంధించి జరిగిన కిడ్నాప్ కేసులో ఆమె ఏ1గా ఉంది. సోమవారం నాడు భూమి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ని విచారించిన సికింద్రాబాద్ కోర్టు.. జీవిత కాలం శిక్ష పడే నేరాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది.
పిటిషన్‌ని రిటర్న్ చేసింది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ మరోసారి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్‌ని దాఖలు చేయనున్నారు. పోలీసులు ఆమె బెయిల్ పిటీషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందులో ఆమెపై తీవ్ర అభియోగాలు మోపారు. ఆమె కుటుంబానికి ఫ్యాక్ష్యన్ నేఫథ్యం ఉందని..ఇంకా కీలక నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నందున ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు.