Telugu Gateway
Telangana

ఈడీ ఎంటర్ అయినా తర్వాతే తెలంగాణ సర్కారు కదిలిందా?!

ఈడీ ఎంటర్ అయినా తర్వాతే తెలంగాణ సర్కారు కదిలిందా?!
X

తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కాం వెలుగులోకి వచ్చినా ఇప్పుడు అందులో కీలక నేతల పేర్లు విన్పిస్తున్నాయి. అంటే చాలా మంది తెర వెనక ఉండి అక్రమార్కుల కొమ్ముకాస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ సాహితి ఇన్ఫ్రా కు చెందిన 900 కోట్ల రూపాయల గోల్ మాల్ అంశం ప్రస్తావిస్తున్నారు. ఎందుకు అంటే ఈ కంపెనీ బాధితులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు. అంతే కాదు కొంత మంది అయితే ఈ ఏడాది ఆగస్టులోనే అధికారికంగా ఫిర్యాదులు చేశారు.అయినా నాలుగు నెలలు పాటు సాహితి ఇన్ఫ్రా ప్రమోటర్ లక్ష్మీనారాయణ పై ఎలాంటి చర్యలు లేవు. పైగా మోసం చేసిన కంపెనీ అధినేతకు బాధితులతో సెటిల్ చేసుకొనే అవకాశం కూడా కల్పించారు. ఇతర కేసుల్లో అయితే ఆలా ఉండదు అనే విషయం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే లక్ష్మీనారాయణకు ఇంత వెసులుబాటు దొరికిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అంతే కాదు..ఈ మొత్తం ఎపిసోడ్ పై ఈడీ ఫోకస్ పెట్టడం తో పాటు కంపెనీ లావాదేవీలకు సంబధించి ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రిపోర్టులు తీసుకుంది. ఈడీ ఎంటర్ అయినా తర్వాతే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని గ్రహించి వెంటనే పోలీస్ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసారని అధికార వర్గాలు చెపుతున్నాయి. లేక పోతే ఇంత పెద్ద ఫ్రాడ్ లో ఎవరైనా వెంటనే చర్యలు తీసుకుంటారు కానీ...నెలలు నెలలు తరబడి ఫ్రాడ్ చేసిన వాళ్లకు వెసులుబాటు ఇచ్చారు అంటే ఇందులో కీలక నేతలు ఉండటమే కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పటికే కొంత మంది నేతలు జాగ్రత్త పడ్డారని చెపుతున్నారు. మరి ఈడీ పూర్తి స్థాయి విచారణ చేపడితే ఎలాంటి విషయాలు బహిర్గతం అవుతాయో చూడాల్సి ఉండి. మరో కీలక అంశం ఏమిటి అంటే ఈడీ కొద్ది నెలల నుంచి ఈ వ్యవహారం పై ఫోకస్ పెట్టింది అని చెపుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులకు సంబంధించి చాలా సంచలనాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it