Telugu Gateway
Telangana

రైతు బంధు కోసం 7300 కోట్లు

రైతు బంధు కోసం 7300 కోట్లు
X

రైతు బంధు పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవార నాడు సమీక్ష నిర్వహించారు. పది రోజుల్లో 7300 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు సర్కారు రెడీ అవుతోంది. డిసెంబర్ 27న ప్రారంభించి..జనవరి 7వ తేదీలోగా రైతులు అందరికీ ఈ నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కెసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని చెప్పారు. యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పంపిణీకి సంబంధించి అధికారులతో సిఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.

Next Story
Share it