ఇంటి దొంగలకు రేవంత్ వార్నింగ్
BY Admin12 July 2021 3:05 PM GMT
X
Admin12 July 2021 3:05 PM GMT
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసే నేతలకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇంటి దొంగలను వదిలిపెట్టే ప్రశ్నేలేదన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కాపాడుకుంటామని..ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యం అన్నారు.
కౌషిక్ రెడ్డి రాజీనామాపై రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై కౌషిక్ రెడ్డి కోవర్ట్‌గా మారారని విమర్శించారు. నెలాఖరు వరకు కాంగ్రెస్ ఇంటి దొంగలకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలను వేధించే అధికారులకు కూడా భవిష్యత్ లో తిప్పలు తప్పవన్నారు.
Next Story