Telugu Gateway
Telangana

ఇది కెసీఆర్, జ‌గ‌న్ ల ఉమ్మ‌డి కుట్ర‌

ఇది కెసీఆర్, జ‌గ‌న్ ల ఉమ్మ‌డి కుట్ర‌
X

ప్లీన‌రీ వేదిక‌గా టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు కొత్త రాజ‌కీయ దుమారానికి తెర‌లేపాయి. ఏపీలో పార్టీ పెట్ట‌మ‌ని, తెలంగాణ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌మ‌ని చాలా మంది ఆ రాష్ట్ర కోరుతున్నారంటూ సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి కౌంట‌ర్ ఇచ్చిన ఏపీ మంత్రి పేర్ని నాని పార్టీ ఎందుకు..రెండు రాష్ట్రాలు క‌లిపేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయండి..అప్పుడు అదే పార్టీతో ఎక్క‌డైనా పోటీచేయ‌వ‌చ్చు అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్య‌వ‌హారంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ఆయ‌న మ‌రో మ‌లుపుతిప్పారు. 'కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ "సమైక్య రాష్ట్ర"ప్రతిపాదన తేవడం…కేసీఆర్, జగన్ ల "ఉమ్మడి" కుట్ర. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…!' అంటూ పోస్ట్ చేశారు.

Next Story
Share it