Telugu Gateway
Telangana

పార్ల‌మెంట్ న‌డుస్తుంటే సోనియాను ఈడీ విచార‌ణ‌కు పిలుస్తారా?

పార్ల‌మెంట్ న‌డుస్తుంటే సోనియాను ఈడీ విచార‌ణ‌కు పిలుస్తారా?
X

కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పార్ల‌మెంట్ సమావేశాలు సాగుతున్న వేళ సోనియాను ఈడీ విచార‌ణ‌కు ఎలా పిలుస్తార‌ని ప్ర‌శ్నించారు. ఈడీ ద్వారా ఇబ్బందులు పెట్ట‌డం వల్ల మీకు రాజకీయ మానసిక ఆనందం వస్తదా..? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో గ్యాస్, జిఎస్టీ పెట్రోల్ ధరల మీద పోరాటం చేస్తుంటే పక్క దారి పట్టించడానికే సోనియాను ఈడీ ఆఫీస్ కి పిలిచారని ఆరోపించారు. ఈడీ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసులివ్వడం కక్ష సాధింపు చర్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం సోనియాగాంధీ కి అండగా నిలబ‌డింద‌ని తెలిపారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేత‌లు అందరూ హైద‌రాబాద్ లోని ఈడీ కార్యాల‌యం ముందు ధ‌ర్నా నిర్వ‌హించారు.

2004 - 14 వరకు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, విద్యా హక్కు చట్టం,సమాచార హక్కు చట్టం, ఆహారభద్రత చట్టం,ఉపాధిహామీ తీసుకొచ్చారన్నారు. దోచుకున్న దొంగలను శిక్షించడానికి సమాచార హక్కు చట్టం తెచ్చారు. ఆమెనే దోచుకున్నట్టు అయితే ఈ చట్టం తెచ్చే వారా అని ప్ర‌శ్నించారు. నాలుగు కోట్ల ప్రజలు స్వతంత్రం గా బతకాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షి ప్ర‌జ‌ల క‌ల‌ను నిజం చేశార‌ని పేర్కొన్నారు. తాము చేసేది రాజకీయ పోరాటం కాదు..ఆత్మగౌరవ పోరాటం అన్నారు. ఇందులో అంద‌రూ జెండాలు..ఏజెండాలు ప‌క్క‌న పెట్టి భాగ‌స్వాములు కావాల‌ని కోరారు.

Next Story
Share it