Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి మెరుపు పాదయాత్ర

రేవంత్ రెడ్డి మెరుపు పాదయాత్ర
X

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాడు రాజీవ్ రైతు భరోసా దీక్షలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే సీతక్క, సీనియర్ నేత మల్లు రవి కోరిక మేరకు మెరుపు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి ఆయన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుండి హైదరాబాద్ వరకు రాజీవ్ రైతు భరోసా పాధయాత్ర ప్రారంభించారు. ఇందులో రేవంత్ రెడ్డి తోపాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ జులుం చేస్తే మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. రైతుల పంట కొనలేని కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. మోదీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను కేసీఆర్ సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదానీ, అంబానీల కోసం రైతుల ప్రయోజనాలను మోదీ తాకట్టుపెట్టారన్నారు. రైతుల పంటకు ధర దళారి నిర్ణయిస్తున్నాడని రేవంత్‌ మండిపడ్డారు.

'నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే శక్తి నల్లమల బిడ్డనైన నాకు ఈ ప్రాంత ప్రజలిచ్చారు. కోట్లు సంపాదిద్దామని రైతు వ్యవసాయం చేయడు. బీరువాల్లో బంగారం నింపడానికి వ్యవసాయం చేయడు. ఎకరం భూమి ఉంటే ఆత్మగౌరవంగా భావించి వ్యవసాయం చేస్తాడు. మార్కెట్ లో ఏది కొనాలన్నా ధర నిర్ణయించేది అమ్మేవాడే... రైతు పంటకు మాత్రం దళారీ ధర చెబుతున్నాడు. 15 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు మోడీ రుణమాఫీ చేశాడు.త్త చట్టాల్లో కొనుగోలు కేంద్రాలు లేవు, మార్కెట్ యార్డులు లేవు, మద్ధతు ధర లేదు. రైతులు కష్టాలు ఇట్ల ఉంటే కారెక్కి ఇంటికి ఎట్ల పోతా' అని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్ తోడు దొంగలు అని ఆరోపించారు.

Next Story
Share it