Telugu Gateway
Telangana

రేవంత్ పాదయాత్ర తో కాంగ్రెస్ ఫేట్ మారుతుందా?!

రేవంత్ పాదయాత్ర తో కాంగ్రెస్ ఫేట్ మారుతుందా?!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు..టిపీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా ఎంతో కీలకం. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా ఇప్పటికే రెండు సార్లు ఓటమి చవి చూసిన కాంగ్రెస్ మరో సారి పరాజయం పాలు అయితే తమిళనాడు కాంగ్రెస్ లాగా మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.అధికార పార్టీపై పోరాడాల్సిన కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు బయటినుంచి వచ్చి పీసిసి పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పై పోరాటం చేస్తున్నారు. ఇది చూసిన కాంగ్రెస్ అభిమానులు ఒకింత షాక్ లో ఉన్నారనే చెప్పొచ్చు. అయితే పార్టీ సీనియర్ నాయకుల గొడవను లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్న రేవంత్ రెడ్డి అంతా అధిష్టానమే చూసుకుంటది అంటూ తన పని మాత్రం తానూ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో సీనియర్ల విమర్శలకు కౌంటర్ గా అన్నట్లు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారంతా పార్టీ పదవులకు రాజీనామా చేయటంతో ఈ అంశంపై విమరసాలు చేసిన సీనియర్లను ఇరకాటంలోకి పెట్టినట్లు అయింది. వాస్తవం మాట్లాడుకోవాలంటే అధికారంలో ఉన్నప్పుడు అయితే కాంగ్రెస్ లాంటి పార్టీలో పార్టీ పదవులకు చాలా విలువ ఉంటుంది.

కానీ రెండు సార్లు ఓటమి పాలు అయిన రాష్ట్రంలో పీసి సి కమిటీ పదవులతో పెద్దగా ఒరిగేది ఏమి ఉండదని సీనియర్లు అంతా ఒక పథకం ప్రకారమే రచ్చ చేస్తున్నారు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రకటన చేయటంతో రేవంత్ రెడ్డి అంతా సైలంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు అనే చర్చ సాగుతోంది. జనవరి 26 నుంచి మొదలు పెట్టి ..జూన్ 2 వరకు పాదయాత్ర సాగనుంది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ ను పెంచటంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా లాభం చేస్తుంది అనే అభిప్రాయం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సీనియర్ నేతలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంత హంగామా చేస్తారు...పార్టీ కి నష్టం చేసే పనులు ఇలాగే కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు కీలకం కాబోతోంది. ఎవరు ఉన్నా లేక పోయినా అన్న చందంగా రేవంత్ రెడ్డి మాత్రం తన టార్గెట్ తాను రీచ్ అయ్యేందుకు కావాల్సిన పనిలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పాదయాత్ర తో అయినా కాంగ్రెస్ పార్టీ ఫేట్ మారుతుందా అన్నది వేచిచూడాల్సిందే. కాంగ్రెస్ లో తాజా రచ్చను వాడుకుని ఆ పార్టీ నేతలపై బీజేపీ వల విసురుతోంది. ఇది వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది కొద్దికాలం పోతే కానీ తెలియదు.

Next Story
Share it