Telugu Gateway
Telangana

అబ‌ద్దానికి ఒక రూపం ఉంటే అది కెసీఆర్..అని నేను అన‌ను!

అబ‌ద్దానికి ఒక రూపం ఉంటే అది కెసీఆర్..అని నేను అన‌ను!
X

ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి ఇస్తామ‌ని అత్యంత కీల‌క‌మైన హామీ ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశారు. అలా అని తాము ఎప్పుడూ చెప్ప‌లేద‌ని...మేనిఫెస్టోలో కూడా పెట్ట‌లేద‌ని అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. దీంతో పార్టీలు అన్నీ కెసీఆర్ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నాయి. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో మేనిఫెస్టోలో పెట్టిన అంశంతోపాటు కొన్ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. 'అబ‌ద్దానికి ఒక రూపం ఉంటే, సిగ్గులేని మాట‌ల‌కు ఒక ప్ర‌తిరూపం ఉంటే..తాగుబోతు మాట‌లు నీటి మీద రాసిన రాత‌లు అనేది నిజ‌మే అయితే, అసెంబ్లీ సాక్షిగా అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడుత‌రు అంటే అది గౌర‌వ ముఖ్య‌మంత్రి కెసీఆర్ గారు అని నేనైతే అన‌ను.

మీరు ఊహించుకుంటే నేను బాధ్యున్ని కాదు.' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో స్ప‌ష్టంగా అర్హులైన ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి వ‌స‌తి క‌ల్పించ‌టంతోపాటు సాగుకు కావాల్సిన క‌రెంటు,విత్త‌నాలు మొద‌టి ఏడాదికి కావాల్సిన పెట్టుబ‌డి త‌దిత‌ర సాయాలు అన్నీప్ర‌భుత్వం అంద‌జేస్తుంది. పంట‌ల బీమా ప‌థ‌కం అమ‌లు చేస్తుంది. కుటుంబంలోని మ‌హిళ పేరు మీద ప‌ట్టా ఇస్తాం అని రాశారు. తొలి ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని సుస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు.

Next Story
Share it