Telugu Gateway
Telangana

స్వ‌గ్రామంలో రేవంత్ ప్ర‌త్యేక పూజ‌లు

స్వ‌గ్రామంలో రేవంత్ ప్ర‌త్యేక పూజ‌లు
X

రాజ‌కీయ నేత‌లు అంద‌రూ ద‌స‌రా సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా గ్రామానికి వ‌చ్చిన రేవంత్ కు పొలిమేరల్లో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు రేవంత్. త‌ర్వాత జమ్మిచెట్టు వద్ద గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Next Story
Share it