Telugu Gateway
Telangana

కెసీఆర్ రైతు చట్టాలను తిరస్కరించాలి

కెసీఆర్ రైతు చట్టాలను తిరస్కరించాలి
X

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్రంలో అమలు చేయకూడదన్నారు. ఈ హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. కొత్త చట్టాల ప్రకారం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. బహుళ జాతి కంపెనీలకు నష్టం వస్తే 1.25 లక్షల కోట్లు కేంద్రం భరిస్తుందని..కానీ ప్రభుత్వ రంగసంస్థలను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి బుధవారం నాడు బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో చాలా మంది ప్రజలను కలవలేక పోయాను.. క్షమించాలని కోరారు. కేసీఆర్ నాటకాలకు సురభి నాటకాల్లో ఆస్కార్ అవార్డ్ వచ్చేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బ్యాంక్‌లో వేస్తున్న రైతుబంధు సొమ్ము అప్పు మిత్తికే కట్ అవుతోందని అన్నారు. రైతుకు పెట్టుబడికి ఉపయోగపడటం లేదని వ్యాఖ్యానించారు. రుణ మాఫీ అమలు చేయకపోవటం వల్ల రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అమన్ గల్ మండలం కుప్పగండ్ల గ్రామపంచాయితీ పరిధిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే 400 ఎకరాల గిరిజనుల భూములు ఆక్రమించుకున్నారని బాధితులు చెప్పారని తెలిపారు.

దీనిపై త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. ఫార్మాసీటీ పేరుతో ప్రజల భూములు లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కందుకూరు, కడ్తాల్‌లో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల మీదపెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు కేసీఆర్ ఫామ్ హౌజ్ భూమిని ఇవ్వాలన్నారు. కేసీఆర్ తన భూమిని రైతుల కోసం త్యాగం చేయాలన్నారు. వచ్చే మూడు నెలలు కాంగ్రెస్ పార్టీ జై జవాన్..జై కిసాన్ నినాదంతో ముందుకు సాగుతుందన్నారు. రైతు చట్టాల విషయంలో ప్రధాని మోడీ, సీఎం కెసీఆర్ ఒక్కటయ్యారని ఆరోపించారు.

Next Story
Share it