Telugu Gateway
Telangana

డ్రగ్స్ వినియోగం..ఒకరు అరెస్ట్

డ్రగ్స్ వినియోగం..ఒకరు  అరెస్ట్
X

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. జన్వాడ లోని ఓ ఫార్మ్ హౌస్ లో రాజ్ పాకాల రేవ్ పార్టీ నిర్వహించినట్లు ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి భారీ హంగామాతో అక్కడ పార్టీ నిర్వహించగా...కొంత మంది ఫిర్యాదు మేరకు పోలీస్ లు ఫార్మ్ హౌస్ లో తనిఖీలు చేశారు. తనిఖీలకు తొలుత నిర్వాహకులు ససేమిరా అన్నా పోలీసులు పార్టీ ఏరియా మొత్తాన్ని పరిశీలించారు. అక్కడే అనుమతి లేకుండా విదేశీ మద్యం సరఫరా చేయటంతో పాటు ఫార్మ్ హౌస్ లో కేసినో లో ఉపయోగించే కాయిన్స్ కూడా దర్శనం ఇచ్చాయి.

ఈ పార్టీ లో మొత్తం 35 నుంచి 40 మంది పాల్గొన్నట్లు పోలీస్ లు చెపుతున్నారు. పార్టీ లో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో ఒకరు కొకెయిన్ పాజిటివ్ గా తేలినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ పార్టీ లో డ్రగ్స్ వాడినట్లు చెపుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విదేశీ మద్యం సరఫరాతో పాటు రేవ్ పార్టీ నిర్వహించిన వారిపై పోలీస్ లు కేసు నమోదు చేశారు. ఈ పార్టీ లో 14 మంది వరకు మహిళలు కూడా ఉన్నట్లు గుర్తించారు. విజయ్ ముద్దార్ అనే వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలటంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది.

Next Story
Share it