Telugu Gateway
Telangana

ఒక్క రోజు 30 కోట్ల రూపాయ‌ల యాడ్స్

ఒక్క రోజు 30 కోట్ల రూపాయ‌ల యాడ్స్
X

బీఎస్పీ తెలంగాణ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలంగాణ స‌ర్కారు తీరును త‌ప్పుప‌ట్టారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఒక్క రోజు 30 కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌ల ఇచ్చార‌ని త‌ప్పుప‌ట్టారు. ఇత‌ర రాష్ట్రాల్లోని ప‌త్రిక‌ల‌కు కూడా యాడ్స్ ఇచ్చార‌న్నారు. 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న దేశవ్యాప్తంగా ఇచ్చిన పత్రికా ప్రకటనల ఖర్చు కనీసం ₹30 Cr ఉంటది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకొని ఉన్నం. జీతాలు టైంకు లేవు, రైతులకు భీమా లేదు, పింఛన్లు లేవు, బిల్లులు లేవు..ప్ర‌జ‌ల డ‌బ్బును మీరు ఇలా ఎలా ఖ‌ర్చు చేస్తారు' అంటూ సీఎంవోను ప్ర‌శ్నించారు. ఏం వెలగబెట్టిండ్రని తెలంగాణ డబ్బులతో కర్ణాటకలో కోట్ల రూపాయల ఫ్రంట్ పేజీ ప్రకటనలు? ఇక్కడ పింఛన్లు లేక మా అవ్వలు తాతలు ఏడుస్తున్నరు!. . మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని రూ. 5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని. ఈ దోపిడీ మీకింకా సరిపోలేదా..? అని ట్వీట్‌ చేశారు.

Next Story
Share it