Telugu Gateway
Telangana

డ్ర‌గ్స్ కేసు ఆధారాలు ఈడీకి ఇవ్వాల్సిందే

డ్ర‌గ్స్ కేసు ఆధారాలు ఈడీకి ఇవ్వాల్సిందే
X

తెలంగాణ హైకోర్టు డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి దాఖ‌లు చేసిన ప్ర‌యోప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు డ్ర‌గ్స్ కు సంబంధించిన ఎప్ఐఆర్ లు...ద‌ర్యాప్తు అధికారులు నివేదిక‌లు, కాల్ డేటా కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ)కి అంద‌జేయాల‌ని ఆదేశించింది. ఒక వేళ ప్ర‌భుత్వం ఈ వివ‌రాలు ఇవ్వ‌క‌పోతే ఈడీ తిరిగి కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. తాము చెప్పిన‌ట్లుగా ఈడీకి వివ‌రాలు స‌మ‌ర్పించపోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా హెచ్చ‌రించింది. రేవంత్ రెడ్డి త‌ర‌పున ఈ కేసులో వాద‌న‌లు విన్పించిన న్యాయవాది రచనారెడ్డి డ్ర‌గ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని, ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని వాదనలు వినిపించారు.

డ్రగ్స్‌ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఈడీ జేడీ అభిషేక్‌ గోయెల్ కూడా కోర్టుకు నివేదించారు. డ్రగ్స్‌ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈడీకి సహకరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక జీపీ మాత్రం ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ కేసుకు సంబంధించిన వివ‌రాలను హైకోర్టుకు, ఈడీకి ఇచ్చామ‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఈ కేసు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఈ మేర‌కు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఈ పిల్ విచార‌ణ‌ను ముగించింది.

Next Story
Share it