కెసిఆర్ ను ఇరకాటంలో పెట్టిన ప్రకాష్ అంబేద్కర్?!
వాస్తవానికి ఈ ప్రతిపాదన కొత్తది ఏమి కాదు...ఎప్పటినుంచో ఉన్నదే. అయితే కెసిఆర్ సమక్షంలో ప్రకాష్ అంబేద్కర్ ఈ ప్రతిపాదన తేవటంతో బిఆర్ఎస్ వర్గాలు షాక్ అయ్యాయి. అయన ప్రతిపాదించినట్లు అదే జరిగితే హైదరాబాద్ పై పూర్తిస్థాయి నియంత్రణ తెలంగాణ ప్రభుత్వం చేజారుతుంది. సహజంగానే ఏ రాష్ట్రం ఇందుకు అంగీకరించదు. ప్రాంతీయవాదం తో తొలుత టిఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టిన కెసిఆర్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో వెళ్లేందుకు పేరును బిఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. ప్రాంతీయ వాదిగా ఉన్నప్పుడు ఓకే కానీ..ఇప్పుడు కెసిఆర్ జాతీయవాదిగా మారాక ప్రకాష్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యల పై మాట్లాడలేక పోయారనే చర్చ సాగుతుంది. అందుకే అందరూ మౌనంగా ఉన్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ ప్రతిపాదన వ్యతిరేకించిన ఇబ్బందులు తప్పవని కొంత మంది నేతలు అబిప్రాయపడుతున్నారు.