Telugu Gateway
Telangana

ప్రెస్ క్ల‌బ్ ద‌గ్గ‌ర పోసాని వ‌ర్సెస్ ప‌వ‌న్ ఫ్యాన్స్ హంగామా

ప్రెస్ క్ల‌బ్ ద‌గ్గ‌ర పోసాని వ‌ర్సెస్ ప‌వ‌న్ ఫ్యాన్స్ హంగామా
X

జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్ పై మ‌రోసారి న‌టుడు పోసాని కృష్ణమురళీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లోని ప్రెస్ క్ల‌బ్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడిన‌ప్ప‌టి నుంచి త‌న భార్య , ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌పై కూడా అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ మెజేస్ లు పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇవే ప్ర‌శ్న‌ల‌ను తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అడుగుతున్న‌ట్లు పోసాని వ్యాఖ్యానించారు. 'పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా నాపై రెచ్చిపోయి కామెంట్స్‌ చేస్తున్నారు. నిన్న ప్రెస్‌మీట్‌ నిర్వహించినప్పటి నుంచి నాకు వేలల్లో బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. నన్ను బూతులు తిడుతూ పవన్‌ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అభిమానులను అడ్డు పెట్టుకుని పవన్‌ నియంతలా ప్రవర్తిస్తున్నారు.. పవన్‌ సైకోలా వ్యవహరిస్తున్నారు.. పవన్‌ను ప్రశ్నించివారెవరైనా వారిపై దాడులు చేస్తారా? మరి పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఎవరినైనా తిట్టొచ్చా?' అని పోసాని ఫైర్ అయ్యారు.

రాజకియాల్లో ఆరోపణలు చేయడం సహజమేనని, గతంలో పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తిట్టారని, అలాగే కేసీఆర్‌ కూడా పవన్‌ను తిట్టారన్నారు. మరి అప్పుడు ఫ్యాన్స్‌ ఎందుకు స్పందించలేదన్నారు. అలాగే పవన్‌ వ్యక్తిగతంగా దూషించడం కరెక్టా? అని ప్రశ్నించారు. పార్టీ పెట్టకముందు నుంచే తాను సీఎం జగన్‌ ఫ్యాన్‌ అని అందుకే ఫ్యాన్స్‌లాగే తాను రియాక్ట్‌ అయ్యానని ఆయన అన్నారు. పోసాని మీడియా స‌మావేశానికి భారీ ఎత్తున పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అక్క‌డ‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు చేరుకుని పోసానితో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా..గేటు ద‌గ్గ‌రే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్క‌డ కొద్దిసేపు ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. మీడియా స‌మావేశంలో పోసాని వ్య‌క్తిగ‌తంగా పవ‌న్ క‌ళ్యాణ్ పై, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఈ వివాదంలోకి లాగినందునే తాను ఇలా మాట్లాడాల్సి వ‌చ్చింద‌న్నారు.

Next Story
Share it