కెసిఆర్ ఫ్యామిలిపై బాంబు పేల్చిన మోడీ
బిఆర్ఎస్ పాలనలో అంతా ఫ్యామిలి మాత్రమే బాగుపడింది అని..కెసిఆర్, అయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావు లు కలిసి లూటీ చేస్తున్నారు అని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా బిఆర్ఎస్ సర్కారు దోచుకుంటుంది అని ఆరోపించారు. తెలంగాణాలో బిఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని...కుటుంబస్వామ్యంగా మార్చింది అని ఆరోపించారు. జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత తనపై ఎక్కడ లేని ప్రేమ చూపించారు అని...ఇది అసలు కెసిఆర్ అసలు క్యారెక్టర్ కాదు అన్నారు. జీహెచ్ఎంసిలో తమకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ కోరారు అని తెలిపారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ...ప్రజలు ఇచ్చిన తీర్పును వమ్ము చేయం అని చెప్పానన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటానికి బిఆర్ఎస్ నిధులు సమకూర్చింది అని ఆరోపించారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బిఆర్ఎస్ పాపాలు బయటపెడతామన్నారు. తెలంగాణాలో అధికార బిఆర్ఎస్, బీజేపీల మధ్య లాలూచీ ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా వేళ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి అనే చెప్పాలి.