రేవంత్ కు అభినందనల వెల్లువ

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి కి అబినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని నేను హామీ ఇస్తున్నాను అంటూ మోడీ స్పందించారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జగన్ పేర్కొన్నారు. వీళ్ళతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టాలీవుడ్ నుంచి చిరంజీవి లు కూడా రేవంత్ కు అభినందనలు తెలిపారు.