Telugu Gateway
Telangana

కుటుంబ పాల‌న‌లో తెలంగాణా బందీ

కుటుంబ పాల‌న‌లో తెలంగాణా బందీ
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హైద‌రాబాద్ లో టీఆర్ఎస్ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారాలు . తెలంగాణ ప్రజల అభిమానమే నా బలం. తెలంగాణ ప్రజల అభిమానం, ఆప్యాయతలకు రుణపడి ఉంటా. వచ్చిన ప్రతీసారి ఇక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయతలను చూసి రుణపడిపోతున్నా. ఇంత ఎండలోనూ చెమటలు కారుస్తూ తరలి వచ్చిన వారికి కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు. బేగంపేట విమానాశ్ర‌యం వ‌ద్ద ఆయ‌న బిజెపి కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన ప్రతీ ఒక్కరికీ నా శ్రద్ధాంజలి. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అడుగుజాడల్లో నడిచేవాడిని నేను. ఆయన కన్న కలలను సాకారం చేద్దాం. దేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచించేవాళ్లు.. స్వాతంత్ర్యం ముందు నుంచి ఉన్నారు. వాళ్ల కుట్రలు ఆరోజు ఫలించలేదు.. ఈరోజూ ఫలించవు అని మోదీ పేర్కొన్నారు. కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. కుటుంబ పాలన ముగిసిన చోటే అభివృద్ధి జరుగుతుందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు నా దృష్టికి వచ్చాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన అంతా అవినీతిమయం. ఇక్కడి కుటుంబ పాలన అవినీతిమయం. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. ప్రజల మనస్సుల్లోంచి బీజేపీని తీసేయలేరని పేర్కొన్నారు.

ఇక్కడి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. తెలంగాణ కోసం త్యాగాలు ఏ ఒక్క కుటుంబం కోసం చేసింది కాదు. తెలంగాణలో మార్పు తప్పకుండా వస్తుంది.. అది తథ్యం. కుటుంబ పాలన చేసేవారే దేశద్రోహులు. తెలంగాణ భవిష్యత్తు కోసం బీజేపీ పోరాడుతుందని పేర్కొన్న ప్రధాని మోదీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఇక్కడి ప్రజలు అది ఫిక్స్‌ అయిపోయారని ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్ధంలో కొందరు మూఢనమ్మకాలు నమ్ముతున్నారని ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో ఓ ప్రాంతానికి వెళ్తే అధికారం, సీఎం పదవి పోతుందనే నమ్మకం ఉండేది. కానీ, తాను పదే పదే ఆ ప్రాంతానికి వెళ్లానని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మూఢనమ్మకాలతో తెలంగాణ ప్రభుత్వం మీదే నడుస్తోంది, ఇదే ఇక్కడి అభివృద్ధికి అడ్డుపడుతోందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్న ప్రభుత్వం.. అభివృద్ధిని అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఉత్సాహంతో పని చేయాలంటూ కార్యకర్తలకు, నేతలకు ఆయన పిలుపు ఇచ్చారు.

Next Story
Share it