Telugu Gateway
Telangana

బ్లడ్ సాండర్స్ ఆధారంగా వెబ్ సిరీస్

బ్లడ్ సాండర్స్ ఆధారంగా వెబ్ సిరీస్
X

ఎర్రచందనం. కనక వర్షం కురిపించే ఈ అరుదైన కలప ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే సొంతం. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఎర్రచందనం ఉన్నా కూడా చిత్తూర్ జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఉండే దీని రేట్ వేరు..దీని రూట్ వేరు . సహజంగా ఎక్కడ విలువైన సంపద ఉన్నా అక్కడ స్మగ్లర్లు ...వ్యవస్థలు చేతిలో ఉన్న వారు కూడా ఉంటారు. కానీ ఫోకస్ కేవలం స్మగ్లర్లపైనే ఉంటుంది. ఈ ఎర్రచందనం అక్రమాలకు, మోసాలకు అక్షరరూపం ఇచ్చాడు సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి. అయన రాసిన పుస్తకం బ్లడ్ సాండర్స్ ఇప్పుడు దృశ్య రూపంలో అంటే ఫ్రెంచ్ లో వెబ్ సిరీస్ గా రానుంది. ఇందులో ఈ స్మగ్లింగ్ కు సంబంధించి కీలక అంశాలు అన్ని వెలుగు చూడనున్నాయి. ఇంటర్‌పోల్ వెతుకుతున్న కరడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్ దీని ద్వారా మరోసారి వార్తల్లో నిలిచాడు. 'ప్లానెట్ కిల్లర్స్' వెబ్ సిరీస్‌లో భాగంగా షాహుల్ హమీద్ పర్యావరణ నేరాలకు సంబంధించి ‘ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్స్’ అనే ఎపిసోడ్ రానుంది. 'ప్లానెట్ కిల్లర్స్' వెబ్ సిరీస్‌లో భాగంగా షాహుల్ హమీద్ పర్యావరణ నేరాలకు సంబంధించి ‘ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్స్’ అనే ఎపిసోడ్ ఏప్రిల్ 3న ఫ్రాన్స్ టీవీలో ప్రసారం కానుంది.ఈ ఎపిసోడ్‌లో సీనియర్ జర్నలిస్ట్, బ్లడ్ సాండర్స్ రచయిత సుధాకర్ రెడ్డి ఉడుముల కూడా ఉన్నారు. షాహుల్ హమీద్ దుబాయ్ లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. ఆయనకు అన్ని రకాలుగా అండదండలు లభిస్తున్నాయి.

ఏప్రిల్‌ 3న ప్రసారం అవుతున్న ఎపిసోడ్‌ : ప్రీమియర్స్ లిగ్నెస్ అనేది ప్యారిస్‌లో ఉన్న ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ, ప్రెస్ ఏజెన్సీ. వెబ్ సిరీస్‌కు హ్యూగో వాన్ ఆఫెల్ దర్శకత్వం వహించారు. ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీ సిరీస్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ క్రిమినల్స్‌ని పట్టుకునే మార్టిన్ బౌడోట్‌నే ఈ సిరీస్‌కి నిర్మాత. ఏప్రిల్ 3న రాత్రి 9:00 గంటలకు, 9:50 గంటలకు రెండు డాక్యుమెంటరీలు, ది గాడ్‌ఫాదర్ ఆఫ్ ది ఓషన్స్, ది ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ది ఫారెస్ట్‌లు ఫ్రాన్స్ 5లో ప్రసారం అవుతాయి. france.tvలో రీప్లే కోసం అందుబాటులో ఉంటాయి. ఫిల్మ్ డైరెక్టర్ హ్యూగో వాన్ ఆఫెల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇంటర్‌పోల్ రెడ్ లిస్ట్‌లో ఉన్న అగ్రశ్రేణి ఎన్విరాన్‌మెంటల్‌ క్రిమినల్స్‌ని మేము గుర్తించాం. ఎర్రచందనం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ కొండల అడవుల్లో లభిస్తుంది. ఇది అరుదైనది, ఖరీదైనది. ఈ కలపతో తయారు చేసిన ఫర్నిచర్‌కు చైనా, జపాన్‌లో చాలా డిమాండ్‌ ఉంది. ఈ ఎపిసోడ్ చేయడానికి, ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రికలో పనిచేస్తున్న భారతీయ పరిశోధనాత్మక జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములతో కలిసి పనిచేసే అవకాశం మాకు లభించింది.

ఆయన 'బ్లడ్ సాండర్స్ ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్' అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం కూడా చాలా ఉపయోగపడింది. ది ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్‌లో, సుధాకర్ రెడ్డి ఉడుముల కథ కూడా ఉంటుంది’ అని చెప్పారు. తమిళనాడులోని అభిరామానికి చెందిన షేక్ దావూద్ షాహుల్ హమీద్‌ను ఏపీ పోలీసులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెతుకుతున్నాయి. హమీద్‌ తమిళం, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడగలడని ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులో పేర్కొన్నారు. , , , చెన్నై, శేషాచలం అడవులు, సింగపూర్, దుబాయ్‌లలో షాహుల్ హమీద్‌పై ఎపిసోడ్ చిత్రీకరించారు. ఇందులో సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఉడుములతోపాటు పలువురు మాజీ పోలీసు అధికారులు, డీఆర్ఐ అధికారులు, ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు. స్మగ్లర్లు ఇప్పటికే 95% జాతులను నాశనం చేశారు. ఇంటర్‌పోల్ 2016 నుంచి ఈ భారతీయ నేరస్థుడిని వెతుకుతోంది.ఇప్పటికే సాహుల్ హమీద్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇండియన్‌ పోలీసులు మొదటిసారి అరెస్టు చేసిన తర్వాత సాహుల్ హమీద్ దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుంచే నేర కార్యకలాపాలు కొనసాగించాడు.మొత్తం నాలుగు ఎపిసోడ్స్ వస్తుంటే ఎర్ర చందనం ఎపిసోడ్ లో మాత్రం సుధాకర్ రెడ్డి ఉడుముల ఉంటారు. ఇందులో ఒకటి ఎర్రచందనం అయితే మరొకటి కార్బన్, సముద్రాలు, దంతాలు వంటి సబ్జెక్టులపై ఈ ఎపిసోడ్స్ ఉంటాయి.

Next Story
Share it