రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం కొనం

తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజ కేంద్రం కొనాల్సిందేనని టీఆర్ఎస్ సర్కారు డిమాండ్ చేస్తోంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానమా?. దేశమంతటికి ధాన్యం సేకరణలో ఒకే విధానం అమలు చేయాలని సీఎం కెసీఆర్ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో ఉత్పత్రి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ సాధ్యంకాదని తేల్చిచెప్పారు. ఇందులో పలు అంశాలు ఇమిడి ఉంటాయన్నారు. కనీస మద్దతు ధరతోపాటు మార్కెట్ డిమాండ్, సరఫరా, ధరలు తదితర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. అస్సాంలో ధాన్యం సేకరణ పై అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు . టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను కలసి తెలంగాణకు చెందిన ఇదే అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చారని..వారికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరగా..పార్లమెంట్ సమావేశాలు..ఇతర షెడ్యూల్స్ చూసుకుని సమయం ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు ఎంపీలు పీయూష్ గోయెల్ ను గురువారం నాడే కలిసే అవకాశం ఉంది.