Telugu Gateway
Telangana

జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్

జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్
X

రిజర్వేషన్లు రొటేషన్ చేయకుండా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించటం నిబంధనలకు విరుద్ధం అని పిటీషన్ దాఖలైంది. అయితే ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేశారు. ప్రభుత్వం తెచ్చిన జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ సెక్షన్‌ 52ఇ రిజర్వేషన్‌ పాలసీకి విరుద్దంగా ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు.

పాత రిజర్వేషన్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, రెగ్యులర్‌ రొటేషన్‌ చేసేంత వరకు గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహించ వద్దని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టీస్ విచారిస్తారని తెలిపిన న్యాయవాది అభిషేక్ రెడ్డి.. పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కు బదిలీ చేశారు. రేపు ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ విచారించనుంది. అయితే హైకోర్టు మాత్రం స్టే ఇవ్వలేదు.

Next Story
Share it