Telugu Gateway
Telangana

బిజెపి స‌ర్కారు కూలేవ‌ర‌కూ పోరాటం

బిజెపి స‌ర్కారు కూలేవ‌ర‌కూ పోరాటం
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) నేత‌, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వం కూలిపోయేవ‌ర‌కూ తాము పోరాటం చేమ‌స్తామ‌న్నారు. ఆయ‌న సోమ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రైతుల శ్రేయస్సును కోరుకునే పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. రైతుల కోసం 50 వేల కోట్ల రూపాయ‌ల నిధులు వారి ఖాతాల్లో డైరెక్ట్‌గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్ కు ఉంద‌న్నారు. తెలంగాణ అభివృద్ధి దేశం అంతా కనిపిస్తున్నాఇక్కడి కళ్లులేని కబోదులైన ప్రతిపక్షాలకు మాత్రం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 141 మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐ కి తెలంగాణ ఇచ్చిందన్నారు.

42లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసిందన్నారు. బీజేపీ నాయకులను కళ్లాల దగ్గర రైతులు అడ్డుకుంటే గవర్నర్ ను విజిట్ కు పంపారని అన్నారు. గవర్నర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేసి ప్రభుత్వం ధాన్యం సేకరణ బాగా జరుగుతుందని మెచ్చుకున్నారనే విషయం మర్చిపోవద్దన్నారు. గత ఏడాది కంటే 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వం చేపట్టింది.ఈ రోజు వరకు 5,447 కోట్ల రూపాయలు రైతులకు నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ నిత్యం అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. వచ్చే యాసంగిలో వరి వేయకుండా చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

Next Story
Share it