Telugu Gateway
Telangana

సింధుకు హైద‌రాబాద్ లో ఘ‌న‌స్వాగ‌తం

సింధుకు హైద‌రాబాద్ లో ఘ‌న‌స్వాగ‌తం
X

వ‌ర‌స ఒలంపిక్స్ లో ప‌త‌కాలు ద‌క్కించుకుని స‌త్తా చాటిన పీ వీ సింధు బుధ‌వారం హైద‌రాబాద్ చేరుకుంది. మంగ‌ళ‌వారం నాడు టో్క్యో నుంచి ఢిల్లీ చేరుకోగా అక్క‌డ ఆమెకు కేంద్ర మంత్రులు ఘ‌న స‌న్మానం ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ చేరుకున్న సింధుక‌కు శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో తెలంగాణ క్రీడ‌లు, ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస‌గౌడ్, అధికారులు స్వాగ‌తం ప‌లికారు. టోక్యో ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన పీవీ సింధును మంత్రి అభినందించారు. వర‌సగా రెండు ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా సింధు రికార్డు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ భారత బ్యాడ్మింటన్ కి సింధు ఐకాన్ గా మారిపోయింద‌న్నారు. వ‌చ్చే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందన్న నమ్మకం ఉంద‌ని వ్యాఖ్యానించారు. సింధుకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడు అండగా ఉంటూ.. ప్రోత్సాహం అందిస్తుంద‌ని, తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్ద పీట వేస్తున్నార‌న్నారు.

Next Story
Share it