Telugu Gateway
Telangana

ఈటెలపై మరో విచారణకు ఆదేశం

ఈటెలపై మరో విచారణకు ఆదేశం
X

అసైన్ మెంట్ భూముల వ్యవహారం నివేదిక అయిపోయింది. ఇప్పుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మరో విచారణ. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు జీవో జారీ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్ పేట మండలం లోని దేవరయంజాల్ గ్రామపరిధిలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి చెందిన 1521 ఎకరాల 13 గుంటల వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను మాజీ మంత్రి ఈటల రాజేందర్ తోపాటు ఇతరులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, చట్ట విరుద్దంగా వ్యవహరిస్తూ తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారనీ, అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వివిధ ప్రముఖ పత్రికలు మీడియాలో వస్తున్న ఆరోపణల మీద సమగ్ర దర్యాప్తు కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐఎఎస్ అధికారుతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో.. నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి లు సభ్యులు గా ఉంటారు.

ఈ కమిటీ విధులు. ఆక్రమణలకు గురయిందని ఫిర్యాదులు అందిన భూమి వివరాలను సేకరించడం. ఆక్రమణకు ఎట్లా గురయింది ? ప్రస్థుతం ఆ భూమిని దేనికి వినియోగిస్తున్నారు?. ఆక్రమణ దారుల దగ్గర వున్న డాక్యుమెంట్లు ఏమిటి ? దీనికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ సంస్థ అనుమతులు ఇచ్చిందా అనే విషయాలను సేకరించడం. ప్రస్థుతం అమలులోవున్న ప్రభుత్వ నిబంధనలను ఆక్రమణ దారులు ఎట్లా ఉల్లంఘించారు అనే వివరాలను సేకరించడం. ఖాళీ భూములు ఎంత విస్తీర్ణంలో వున్నాయి. క్రమణల వెనకున్న బినామీలు ఇతర పెద్దమనుషులు ఎవరు ?.తద్వారా దేవాలయానికి ఎంతమేరకు ఆదాయం నష్టం జరుగుతున్నది ? దర్యాప్తు అనంతరం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ?..అనే విషయాలను ఈ కమిటీ నిర్దారించవలసి వుంటుందని జీవోలో పేర్కొన్నారు. సత్వరమే ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కమిటీకి ఆదేశిలిచ్చారు.

Next Story
Share it