Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో రోజుకు ల‌క్ష ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి

తెలంగాణ‌లో రోజుకు ల‌క్ష ఆర్టీపీసీఆర్  టెస్టులు చేయాలి
X

క‌రోనా నియంత్ర‌ణ‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు సోమ‌వారం నాడు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కేసులు పెరుగుతున్న త‌రుణంలో మ‌రింత అప్ర‌మ‌త్తం అవ‌స‌రం అని పేర్కొంది. రాష్ట్రంలో రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ప్ర‌భుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోర్టుకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల‌న్నారు. కోర్టు ఆదేశాల‌పై అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ స్పందిస్తూ కరోనా నియంత్రణపై సోమ‌వారం నాడు మంత్రివర్గం చర్చిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.

మంత్రివ‌ర్గ నిర్ణ‌యాల‌పై కోర్టుకు పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే క‌రోనా కేసులు పెరుగుతున్న కార‌ణంగా హైకోర్టులో మంగ‌ళ‌వారం నుంచి వ‌ర్చువ‌ల్ గా కేసులు విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నారు. కోవిడ్ చ‌ర్య‌ల‌కు సంబంధించిన అంశంపై తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 25 కు వాయిదా వేసింది.

Next Story
Share it