Telugu Gateway
Telangana

కెసిఆర్..కెటిఆర్ ఫాక్స్ కాన్ లక్ష ఉద్యోగాల మాయ!

కెసిఆర్..కెటిఆర్  ఫాక్స్ కాన్ లక్ష ఉద్యోగాల మాయ!
X

అసలు ఆ కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతుంది అన్నది చెప్పలేదు. అసలు పెట్టుబడి ఎంతో తేలకుండా ఉద్యోగాల సంఖ్య ఎలా వచ్చింది. అంతే కాదు..యూనిట్ రెడీ అయితే వెంటనే రెండు వేల మందికో..మూడు వేల మందికో ఉద్యోగాలు వస్తాయని చెపితే అదో లెక్క. కానీ ఏకంగా పదేళ్లలో లక్ష ఉద్యోగాలు అంట. ఇది ప్రజలను మాయ చేయటం కాక మరేమిటి. ఎవరైనా వెంటనే వచ్చే ఫలితాల గురించి చెపుతారు అసలు తెలంగాణ ప్రభుత్వం ఫాక్స్ కాన్ యూనిట్ ద్వారా లక్ష ఉద్యోగాలు అన్నది చెపుతూ...కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే యాడ్స్ మోడల్ ను ఫాలో అయినట్లు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు..ఇతర సంస్థలు ధర ఒకటి చెప్పి అభివృద్ధి చార్జీలు అదనం అని కింద చిన్న అక్షరాలతో రాస్తాయి. ఇప్పుడు తెలంగాణ సర్కారు తీరు కూడా అంతే ఉంది....లక్ష ఉద్యోగాలు అని హంగామా చేసి...పదేళ్లలో అని చిన్నగా చెపుతారు అన్న మాట. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏమిటి అంటే ఫాక్స్ కాన్ రాష్ట్రం లో పెట్టేది ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్. ఇది అంతా ఎక్కువ శాతం ఆటోమేటెడ్ మార్గంలో ఉంటాయని..కొన్నిటికి ప్రోడక్ట్ లైన్స్ కూడా ఉంటాయి...మనుషుల అవసరం తక్కువగా ఉంటుంది అని పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

లక్ష ఉద్యోగాలు అన్నది ఖచ్చితంగా ప్రజలను మాయ చేయటానికి చెప్పే మాటే అని అయన స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ ప్రముఖ కంపెనీ...అది రాష్ట్రానికి రావటం మంచి పరిణామమే. దీన్ని ఎవరు కాదన్నారు. కానీ కంపెనీ అసలు పెట్టుబడి ఎంత పెడుతుందో చెప్పకుండానే ఇంత ఇంత భారీ ప్రకటనలు చేసి..అటు యువతను తప్పు దారి పట్టించటం తో పాటు...రాజకీయంగా లబ్ది పొందటానికి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏ రాష్ట్రం లో పెట్టుబడి పెట్టే కంపెనీ అయినా ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున భూమి, రాయితీలు, ప్రోత్సహకాలు పొందటానికి అటు పెట్టుబడులతో పాటు ...ఉద్యోగాల సంఖ్యను చాలా చాలా ఎక్కువ చేసి చూపిస్తాయనే విషయం తెలిసిందే. ఇలాంటి ప్రకటనలు అన్ని నిజం అయితే అసలు రాష్ట్రంలో నిరుద్యోగమే ఉండ కూడదు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తో ఎంఓయు చేసుకునే సమయంలో చెప్పిన మాటలు...అందులో వాస్తవరూపం దాల్చిన లెక్కలు చాలా తేడా ఉంటాయనే విషయం తెలిసిందే. ఏవో ఒకటి అరా తప్ప అన్ని కంపెనీలది ఇదే బాట. ఆంధ్ర ప్రదేశ్ లో ఫాక్స్ కాన్ ఎప్పుడో శ్రీ సిటీ లో తన యూనిట్ ఏర్పాటు చేసింది.

ఫాక్స్ కాన్ ఖచ్చితంగా

టి వర్క్స్ ఇనాగరేషన్ కు చేఇఫ్ గెస్ట్ వచ్చారు.

Next Story
Share it