మళ్ళీ లక్షకు చేరిన అమ్ముడుపోని ఫ్లాట్స్

అమ్ముడు కాకుండా పేరుకుపోయిన ఈ ఫ్లాట్స్ ( ఇన్వెంటరీ ) క్లియర్ కావాలంటే ఏడాదికి పైనే పడుతుంది. దీనికి 16 నెలల సమయం పెట్టె అవకాశం ఉంది అని ప్రముఖ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో అయితే ఇది 24 నెలలుగా ఉంది. దేశంలోనే అమ్ముడు పోని ఫ్లాట్స్ ఎక్కువ ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. ప్రభుత్వం, కొంత మంది బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి కృత్రిమ బూమ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాయి అని బిల్డర్ లు ఆరోపిస్తున్నారు. ఒక వైపు భూముల రేట్లు, నిర్మాణ వ్యయం పెరగటంతోపాటు గృహ రుణాల వడ్డీ రేట్లు పెరగటం కూడా హోసింగ్ రంగంపై ప్రభావం చూపించినట్లు పరిశ్రమ వర్గాల మాట. అయితే హైదరాబాద్ మార్కెట్ లో ప్రీమియం ఇళ్లకు మాత్రం డిమాండ్ బాగుంది. ఇవి కొనేది ఎలాగు సంపన్నులే కనుక వాళ్లకు రేట్ అనేది పెద్ద సమస్య కాదు. ముఖ్యంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలు మాత్రం పెరిగిన ధరలతో సొంత ఇంటి కల కు దూరం అవుతున్నారు. నగర శివార్లలో కూడా గేటెడ్ కమ్యూనిటీల్లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధరలు కూడా కోటి రూపాయలు చెపుతున్న విషయం తెలిసిందే. నగరంలో అమ్ముడు పోని ఫ్లాట్స్ లక్ష వరకు ఉంటే మాత్రం ప్రభుత్వం రంగు రంగుల కలను చూపించే ప్రయత్నం చేస్తోంది.