Telugu Gateway
Telangana

ఒక్క కెసిఆర్ లో ఎన్ని ఆశా కిరణాలో!

ఒక్క కెసిఆర్ లో ఎన్ని ఆశా కిరణాలో!
X

వచ్చే ఎన్నికల్లో మరో సారి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లోకి రావాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రయత్నాలు చాలా ముందు నుంచే మొదలుపెట్టారు. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ కు మరో ఛాన్స్ ఇస్తే ఇక దేవుడు కూడా ఆంధ్ర ప్రదేశ్ ను కాపాడలేరు అంటూ టీడీపీ అధినేత , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చెపుతున్నారు. టిఆర్ఎస్ ని బిఆర్ ఎస్ గా మార్చిన కెసిఆర్ దేశంలోని కాంగ్రెస్ , బీజేపీ లకు అసలు పాలించటం చేతకాదని..అందుకే తాను రంగంలోకి దిగుతున్నట్లు పలు మార్లు ప్రకటించారు తెలంగాణ సీఎం కెసిఆర్ . ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన కొంత మంది..కర్ణాటక కు చెందిన కొంత మంది కూడా వారి వారి రాష్టాల్లో కెసిఆర్ పాలన..తెలంగాణ మోడల్ పాలనా కావాలని కోరుతున్నట్లు ఆ పార్టీ నేతలు చాలా సార్లు ప్రకటించారు కూడా. ఇప్పుడు తాజాగా కెసిఆర్ ఫామిలీ పత్రిక నమస్తే తెలంగాణ లో ఒక ఆసక్తికరమైన వార్త కనిపించింది.

అదేంటి అంటే ' ఆంధ్రాకూ కేసీఅరే ఆశాకిరణం ' అని..ఆ రాష్ట్రము నుంచి వచ్చిన కొంత మంది చెప్పారంట. రెండు కులాల వైరం తో ఆంధ్ర వెనుకబడి పోయింది కాబట్టి కెసిఆర్ లాంటి దార్శనికుడు కావాలని వాళ్ళు చెప్పినట్లు ఇందులోని సారాంశం. ఒక వైపు కెసిఆర్ దేశం కోసం ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుని ఉన్న తరుణంలో ..అయన ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల అంశం చూస్తారా...జాతీయ విధానంపై ఫోకస్ పెడతారా అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. మరి ఆంధ్ర ప్రదేశ్ కు కూడా కెసిఆర్ ఆశాకిరణం అయితే సీఎం జగన్ ఏమి చేయాలి...మరో సారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న చంద్రబాబు ఏమి చేయాలి...మరో వైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు మరి వీళ్ళందరికీ కెసిఆర్ ఎర్త్ పెట్టబోతున్నారా అన్నది ఇప్పుడు అత్యంత కీలకం కానుంది.

Next Story
Share it